Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్

Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్

దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి  థర్డ్ జెండర్ అభ్యర్థి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్  దాఖలు చేశారు. బీహార్‌కు చెందిన 26 ఏళ్ల రాజన్ సింగ్..ధోతీ, టోపీ, బంగారు ఆభరణాలు సంప్రదాయ దుస్తులు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం(మే 3) నామి నేషన్ పత్రాలను సమర్పించారు. రాజన్ సింగ్ సమర్పించిన అఫిడవిట్ లో తనకు 200 గ్రాముల బంగారం సహా రూ. 15.10 లక్షల చరాస్తులు, బ్యాంకు ఖాతాల్లో రూ. 10వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్థుల జాబితా ఇవ్వలేదు. 

ప్రత్యేక పౌర సౌకర్యాలు లేక థర్డ్ జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్నారని, వారి హక్కుల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనని సింగ్ మీడియాతో చెప్పారు. థర్డ్ జెండర్ల కోసం జాతీయ లింగమార్పిడి కమిషన్ ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో కనీసం ఒక శాతం రిజర్వేషన్ ఉండాలని రాజన్ సింగ్ చెప్పారు. 

తాను ఎన్నికయితే థర్డ్ జెండర్ సమాజం ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో థర్డ్ జెండర్ సంఘానికి సంస్థాగత మద్దతు ఇవ్వకపోవడాన్ని రాజన్ సింగ్ ఎత్తి చూపారు.