ఇవాళ్టి(సెప్టెంబర్ 15) నుంచి.. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్

ఇవాళ్టి(సెప్టెంబర్ 15) నుంచి.. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్

 

  • జెండా ఊపి ప్రారంభించనున్న 
  • కేంద్ర మంత్రి బండి సంజయ్,
  • మంత్రి వివేక్,  ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల, వెలుగు: నాగ్​పూర్ – ​-సికింద్రాబాద్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్​ కల్పిస్తూ ఇటీవల రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ట్రెయిన్​ సోమవారం నుంచి మంచిర్యాల స్టేషన్​లో ఆగుతుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​, రాష్ట్ర కార్మిక, మైనింగ్​ శాఖల మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ఉదయం 8.15 గంటలకు మంచిర్యాలలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైల్వేశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.