
హైదరాబాద్ నాలా ప్రమాదంలో గళ్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం రూ. 5 లక్షలు చెల్లిస్తామన్నారు కలెక్టర్ హరిచందన.అఫ్జల్ సాగర్ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నాలాలో గల్లంతైన వారి మృతదేహాలు దొరకలేదు, దొరికిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నాలాల వద్ద ఉండే ప్రజలు వరద ఉధృతి ఎక్కువ ఉంటే జాగ్రత్తగా ఉండాలన్నారు. కొన్ని నిర్మాణాలు నాళాలపై ఉన్నాయని చెప్పారు. అలాంటి వాటితో అందరికీ ప్రమాదమని అన్నారు. ఈ కాలనీ వారికి ఇందిరమ్మ ఇళ్ల పరిశీలిస్తామని చెప్పారు. 145 ఇల్లు నాలా మీద ఉన్నాయని.. మొత్తం రెండు ఎకరాల్లో అనేక ఇళ్లు ఉన్నాయన్నారు. గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చామని చెప్పారు కలెక్టర్ హరిచందన
►ALSO READ | కస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్స్నాచింగ్
హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయన్నారు కలెక్టర్ హరి చందన. కొన్ని ప్రాంతాల్లో నాళాల వద్ద ప్రమాదాలు జరిగాయి.. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.వరద ప్రాంతాల్లో బాధితులకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సహాయమందిస్తున్నాం..భారీ వర్షం నేపద్యంలో పరిస్థితి పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి గంటకు సమీక్ష నిర్వహిస్తున్నారు.. హైదరాబాదులో నాలాల వద్ద ప్రమాదాలపై రెస్క్యూ బృందాలు గాలింపులు చేపడుతున్నాయి..లోతట్టు ప్రాంతాల్లో నాలాలపై నిర్మించిన ఇళ్లలో ఉండే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు.. నాలాలపై ఉంటున్న ప్రజలకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించే విధంగా అధికారులతో చర్చించి నివేదిక రూపొందిస్తున్నాం. వర్షాల నేపథ్యంలో నాలాల వద్ద ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ హరిచందన.