కస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్స్నాచింగ్

కస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్స్నాచింగ్

కరీంనగర్​ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కస్టమర్​ లా దుకాణానికి వచ్చి చైన్​ స్నాచింగ్​ కు పాల్పడ్డాడు. క్షణాల్లో పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. లబోదిబో మంటూ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్​ జిల్లా ఆరెపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

సోమవారం(సెప్టెంబర్​15) ఉదయం  కరీంనగర్​ పరిధిలోని ఆరెపల్లిలో దుకాణంలో ఉన్న మహిళ మెడలోంచి పుస్తెల తాగు చోరీ చేశాడు గుర్తుతెలియనివ్యక్తి. సామానుకొనేందుకు వచ్చినట్లుగా నటించి షాపు యజమాని అయిన మహిళ మెడలో పుస్తెలతాడు తెంచుకొని పారిపోయాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.