
Aadhaar Card on WhatsApp: ఇప్పుడు అంతా టెక్నాలజీ కాలం. అన్నీ ఉన్న చోటికే క్లణాల్లో కావాలని యువత భావిస్తోంది. పైగా వాట్సాప్ వంటి కమ్యూనికేషన్ సోషల్ మీడియా సాధనం రాకతో ఇది మరింత సులువగా మారిపోయింది. ఇప్పుడు మనం మన ఆధార్ కార్డ్ ను.. నేరుగా వాట్సాప్ ద్వారా ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఎందుకంటే బ్యాంకింగ్ సేవలు పొందటం నుంచి ప్రభుత్వ పథకాల ప్రయోజనాల వరకు ఏది కావాలన్నా ఆధార్ తప్పనిసరి కదా.. పైగా దీంతో UIDAI వెబ్‌సైట్‌లో పదే పదే లాగిన్ అయి క్యాప్చా నింపాల్సిన అవసరం ఉండదు.
డిజిటల్ ఆధార్ కార్డును నేరుగా వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటానికి మనం ముందుగా MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ప్రారంభించాలి. దీని ద్వారా మీ ఆధార్ వివరాలను సురక్షితంగా తిరిగి పొందవచ్చు. పైగా మీ పత్రాల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు..
వాట్సాప్‌లో ఆధార్ డౌన్ లోడ్ ప్రక్రియ..
* ముందుగా మొబైల్ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ +91 9013151515 ను సేవ్ చేసుకోండి.
* వాట్సాప్ ఓపెన్ చేసి పైన నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" అని మెసేజ్ చేయండి.
* మీ మెసేజ్ తర్వాత ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. అందులో "డిజిటల్ ఆధార్ డౌన్‌లోడ్"పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి చెక్ చేసుకోండి.
* వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. నిర్ధారించడానికి దాన్ని నమోదు చేయండి.
* వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డిజిటల్ ఆధార్ కార్డ్ మీ వాట్సాప్ చాట్‌లో PDF ఫార్మాట్‌లో వస్తుంది.
సో.. ఇలా వాట్సాప్ ద్వారా డిజిటల్ ఆధార్ కార్డు పొందొచ్చు. చాలా సింపుల్ కదా.. మీకు డిజిటల్ ఆధార్ కావాలంటే డోంట్ వర్రీ.. మీ చేతిలో ఫోన్.. అందులో వాట్సాప్ ఉంటే చాలు.. పైన చెప్పినట్లు చేస్తే.. ఒకే ఒక్క నిమిషంలో డిజిటల్ ఆధార్ మీ చేతిలో ఉంటుంది.. ఓకేనా..