Mystery Thriller: ప్రశాంతమైన ఊళ్లో వరుస హత్యలతో.. ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Mystery Thriller: ప్రశాంతమైన ఊళ్లో వరుస హత్యలతో.. ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఓ కొత్త మలయాళం మిస్టరీ కామెడీ వచ్చేసింది. అదే డిటెక్టివ్ ఉజ్వలన్. ఈ థ్రిల్లర్ మూవీ లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో శుక్రవారం (సెప్టెంబర్ 12) నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనూ స్ట్రీమ్ అవుతుంది.

ఇందులో ప్రముఖ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించారు. సిజు విల్సన్, రోనీ డేవిడ్ రాజ్, కొట్టాయం నజీర్, సీమా జి నాయర్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంతమైన ఊళ్లో వరుస హత్యల కలకలాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ తో కలిసి లోకల్ డిటెక్టివ్ ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా స్టోరీ. కామెడీ + మిస్టరీ ప్రధానంగా చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. గోపీకృష్ణన్, రాహుల్ జి డైరెక్ట్ చేసిన ఈ మూవీని మిస్ అవ్వకుండా వీకెండ్ ముగించేసేయండి. 

కథేంటంటే:

మంచితనం, ఆనందానికి చిహ్నమైన ఒక ఆదర్శ గ్రామం ప్లాచిక్కవు. స్థానిక దొంగ అంతిక్కురుదన్ (నిహాల్ నిజాం) చేసే చిన్న చిన్న దొంగతనాలు మినహా అసలు అక్కడ నేరాలు జరిగిన దాఖలాలే లేవు. ఆ దొంగతనాలను కూడా స్థానిక షెర్లాక్ హోమ్స్‌‌గా చెప్పుకునే డిటెక్టివ్‌‌ ఉజ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) వెంటనే కనిపెట్టేస్తాడు.

అలాంటి ఊరిలో ఒక దారుణ హత్య జరుగుతుంది. ఆ కేసుని ఛేదించేందుకు స్థానిక ఎస్‌‌ఐ సచిన్ (రోనీ డేవిడ్ రాజ్), డిటెక్టివ్‌‌ ఉజ్వలన్‌‌ కలిసి పనిచేస్తుంటారు. మళ్లీ అదే తరహాలో మరికొన్ని హత్యలు జరుగుతాయి. దాంతో సీఐ శంభు మహాదేవ్ (సిజు విల్సన్) ఇన్విస్టిగేషన్‌‌ మొదలుపెడతాడు. ఇంతకీ హత్యలు చేసేదెవరు?