Waqf Amendment act : వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

Waqf Amendment act : వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

వక్ఫ్​సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన CJI BR గవాయ్ ,న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం(సెప్టెంబర్​15) మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం సవరణను నిలిపివేయాలని కేసు వేయలేదు.. సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలను నిలిపివేసినట్లు కోర్టు తెలిపింది. 

వక్ఫ్​ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తి స్థాయి వక్ఫ్​ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. వక్ఫ్​ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఆస్తులు వక్ఫ్​ బోర్డువా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి..వివాదాస్పద ఆస్తులపై థర్డ్​ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వక్ఫ్​బోర్టులో ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండకూడదని తీర్పునిచ్చింది. 

వక్ఫ్​సవరణ చట్టంలోని మూడు కీలక అంశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. 

  • 5 సంవత్సరాలు ముస్లింలు ఉండాలనే నిబంధన
  • వక్ఫ్​ భూములపై కలెక్టర్​ నిర్ణయం తీసుకోవద్దు
  • వక్ఫ్ సంస్థలలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులను ఉండొద్దు

ఇది తుది తీర్చు కాదు.. కోర్టు పరిశీలన మాత్రమే..చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పార్టీలు తదుపరి వాదనలు వినిపించవచ్చని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.