
ఆస్తికోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు..ఆస్తికోసం తల్లిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు..ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులను నిర్లక్షం చేస్తున్న కన్నబిడ్డలు.. రోజూ ఇలాంటి వార్తలేని వార్తాఛానల్ లేదు.. వార్తాపత్రికల లేదు.. ఆస్తులకోసం కనీపెంచిన తల్లిదండ్రులనే దారుణంగా హింసించి చంపుతున్న దారుణాలు ఎన్నో.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఉన్న భూమిని లాక్కొని తనకు కూడు పెట్డడం లేదని ఓతండ్రి కలెక్టరేట్ సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు.. వివరాల్లోకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీరా విట్టల్, విరవ్వ దంపతులు సోమవారం( సెప్టెంబర్15) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. జిల్లా కలెక్టరేట్ వచ్చిన విట్టల్ దంపతులు.. కలెక్టర్ ఆఫీసులోనే పురుగుల మందుతాగారు. తీవ్ర అస్వస్తతకు గురైకాగా చికిత్సకోసం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కుమారుడు నరేష్ నాయక్, కోడలు తన భూమిని సాగుచేసుకుంటూ.. కనీసం తిండికూడా పెట్టడం లేదని అజ్మీరా విట్టల్ దంపతులు వాపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి ద్వారా తమగోడు వినిపించుకునేందుకు వచ్చారు. అక్కడే పురుగుల మందు తాగి హత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం చికిత్స పొదుతున్నాడు అజ్మీరా విట్టల్.