ప్రజా సమస్యలను పట్టించుకోరా.? అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్

ప్రజా సమస్యలను పట్టించుకోరా.? అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్

మిషన్ భగీరథ,పంచాయతీ రాజ్,ట్రాన్స్ కో అధికారులపై  మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్ అయ్యారు.  మంచిర్యాల కలెక్టరేట్ లో ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పలు  శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి.  ఈ సందర్భంగా  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం పట్ల అధికారులపై అసంతృప్తి వ్యక్తం  చేశారు. త్రాగునీటి సమస్యలు పట్టించుకోకపోవడంతో మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్  వెంకటస్వామి. 

చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి.  ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా అధికారులు పనిచేయాలని   హెచ్చరించారు.  జిల్లాలో యూరియా కొరత,అభివృద్ధి పనుల పై సమీక్షించిన ఆయన.. యూరియా కొరత సృష్టించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆదేశాలు జారీ చేశారు. 

ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి వివేక్ .  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం క్వాలిటీ తో కడుతున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది..పరిహారం బాధితులకు అందించారా లేదా అని ఆరాదీశారు.  గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్. 

అంతకు ముందు ఇవాళ ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్లో  వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ను కేంద్రమంత్రి బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు మంత్రి వివేక్.