Vijay Vs Sangeetha : విడాకులు ఇచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉంటా.. విజయ్‌కి సంగీత బిగ్ షాక్..!

Vijay Vs Sangeetha : విడాకులు ఇచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉంటా.. విజయ్‌కి సంగీత బిగ్ షాక్..!

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త వివాదంలో చిక్కుకుంటూ హట్ టాపిక్ మారారు.  గత కొంతకాలంగా విజయ్ ఆయన భార్య  సంగీత విడిపోతున్నారంటూ  వార్తలు వచ్చాయి.  ఊహించినట్లుగానే విజయ్ నుంచి విడాకుల కోసం సంగీత కోర్టులో పిటిషన్ దాలు చేసింది. అయితే ఇప్పుడు మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసి విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. 

విడాకుల కేసులో ఊహించని మలుపు

విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత ఇప్పటికే చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 24న ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆ కారణంగానే తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. ఆ రోజు విజయ్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే సమన్లు జారీ చేసింది.

విజయ్ ఇంట్లోనే ఉంటా..

తాజాగా సంగీత కోర్టులో మరో అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు . ఇందులో ఆమె కోరిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విడాకుల కేసు ముగిసే వరకు తాను చెన్నైలోని విజయ్ నివాసంలోనే ఉంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. తాను బ్రిటన్ పౌరసత్వంతో లండన్‌లో ఉంటున్నానని, ప్రస్తుతం భారతదేశంలో తనకు సొంత ఇల్లు లేదని ఆమె పేర్కొన్నారు. తాను ఇంట్లోకి వస్తానంటే విజయ్ అడ్డుకుంటున్నారని, తనను లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని సంగీత కోర్టును వేడుకున్నారు. నీలాంగరై ఇంట్లోకి రానివ్వకుండా విజయ్ తన లాయర్ల ద్వారా తనను బెదిరిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

26 ఏళ్ల బంధం.. 

గడిచిన 26 ఏళ్లుగా విజయ్‌కి భార్యగా అన్ని బాధ్యతలు నెరవేర్చాను. పిల్లలను క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశాను అని సంగీత పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక గృహిణిగా ఆ ఇంటి అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉంది. కాబట్టి నీలాంగరై ఇంటిపై నాకు సమాన హక్కు ఉంది . అలాగే, విజయ్ సంపాదిస్తున్న కోట్ల రూపాయల ఆస్తిలో తనకు, తన పిల్లలకు న్యాయంగా అందాల్సిన మనోవర్తిని (Alimony) ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

నెటిజన్ల అనుమానాలు

సంగీత పదే పదే నీలాంగరై ఇంటి గురించే ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. విజయ్ గతంలో తన విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న ఆ 'నటి' ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నారా? అందుకే సంగీత అక్కడికి వెళ్లాలని పట్టుబడుతున్నారా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న విజయ్‌కి, ఈ వ్యక్తిగత వివాదాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.