టీచర్లకు టెన్త్ స్టూడెంట్ల దత్తత.. ప్రతిరోజూ ఉదయమే వేకప్ కాల్స్ !

టీచర్లకు టెన్త్ స్టూడెంట్ల దత్తత.. ప్రతిరోజూ ఉదయమే వేకప్ కాల్స్ !

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ పక్కా ‘యాక్షన్ ప్లాన్’ను సిద్ధం చేసింది. నిర్దేశిత గడువు ప్రకారం జనవరి 10వ తేదీ నాటికే సిలబస్‌‌‌‌ మొత్తాన్ని పూర్తి చేయాలని డెడ్‌‌‌‌లైన్ విధించింది. విద్యార్థుల ఉత్తీర్ణత బాధ్యతను టీచర్లే స్వయంగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.

విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పెంచేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఈసారి సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఒక్కో టీచర్‌‌‌‌ కొంతమంది టెన్త్ స్టూడెంట్లను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది.  టీచర్లే  ప్రతిరోజూ ఉదయం ఫోన్లు చేసి పిల్లలని మరీ నిద్రలేపాలి. పిల్లల చదువు తీరుపై తల్లిదండ్రులతో తరచూ పేరెంట్స్ మీటింగ్‌‌‌‌లు పెట్టి మాట్లాడాలని ఆదేశాల్లో పేర్కొంది.