నిర్మల్, వెలుగు: హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గల కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే క్యాన్సర్ చికిత్సలు నిర్మల్ లో అందుబాటులోకి తెచ్చామని డీవీఆర్ హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అనుదీప్ ప్రతి శుక్రవారం నిర్మల్ లోని ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్సలను అందజేస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన డాక్టర్ అనుదీప్ తో కలిసి చికిత్సల వివరాలను వెల్లడించారు.
మూడు నెలల కింద దేవేందర్ రెడ్డి ఆస్పత్రిలో క్యాన్సర్ సంబంధిత కీమోథెరపీ చికిత్సలను ప్రారంభించామన్నారు. వంద మందికి పైగా క్యాన్సర్ బాధితులకు అతి తక్కువ ఖర్చులో చికిత్సలు అందజేశామన్నారు. గతంలో కీమోథెరపీ చేయడం ద్వారా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేవని, కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ టార్గెట్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ వల్ల రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సలు చేస్తున్నామన్నారు.
