సింగరేణి  జీఎం ఆఫీస్ ఎదుట సెక్యూరిటీ గార్డుల ధర్నా

సింగరేణి  జీఎం ఆఫీస్ ఎదుట సెక్యూరిటీ గార్డుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న గార్డులు తమకు విధులు కల్పించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం సింగరేణి జీఎం ఆఫీస్​ ఎదుట నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ సింగరేణి ఎస్అండ్​పీసీ డిపార్ట్​మెంట్​ కాంట్రాక్ట్​ సెక్యూరిటీ విభాగంలో పదేండ్లుగా 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని, గత కాంట్రాక్ట్​ కంపెనీ వీపీ వర్గీస్​కు సెక్యూరిటీ టెండర్ కాలపరిమితి ముగిసిందన్నారు.

దీంతో తమకు డ్యూటీలు నిలిపివేశారన్నారు. కొత్త టెండర్​ వచ్చినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడంతో వందలాది మంది గార్డులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే కొత్త టెండర్​ అమలు చేస్తూ తమకు డ్యూటీలు కల్పించాలని డిమాండ్​ చేశారు.