ఉట్నూర్ మండల కేంద్రంలో మండుటెండలో విద్యార్థుల ధర్నా

 ఉట్నూర్ మండల కేంద్రంలో మండుటెండలో విద్యార్థుల ధర్నా
  • దూషిస్తున్న అధ్యాపకురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇంద్రవెల్లి, (ఉట్నూర్) వెలుగు: ఓ అధ్యాపకురాలు తమను అసభ్య పదజాలంతో దూషిస్తోందని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన డిగ్రీ కాలేజీ విద్యార్థులు మండుటెండలో కాలేజీ ఎదుట బైఠాయించారు.

ఓ అధ్యాపకురాలు హాస్టల్​లో ఉంటూ నిత్యం తమను అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది ధర్నా వద్దకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరమింపజేశారు.