జాతీయ ఓబీసీ మహాసభకు రండి..మంత్రులకు జాజుల ఆహ్వానం

 జాతీయ ఓబీసీ మహాసభకు రండి..మంత్రులకు జాజుల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వచ్చేనెల 7న బెంగళూరులో జరిగే  ఓబీసీ మహాసభకు  రావాలని  మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖను  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  ఆహ్వానించారు.

మంగళవారం వారిని జాజుల కలిశారు. బీసీ ఉద్యమాన్ని  ఢిల్లీ వరకు బలోపేతం చేయనున్నట్లు   తెలిపారు. బెంగళూర్​సిటీ యూనివర్సిటీలో ఈ మీటింగ్ జరగనుందని,  దేశ వ్యాప్తంగా  బీసీ నేతలు అటెండ్ కానున్నారని జాజుల వెల్లడించారు.  జాజులతో గణేష్ చారి, శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, శ్యాం ఉన్నారు.