హైదరాబాద్ లోని సోమాజిగూడలోని పార్క్ హోటల్ లో CII వార్షిక సమావేశం నిర్వహించారు. శనివారం ( మార్చి 7 ) జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. 2043 నాటికి తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే తమ లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు.
సీఐఐ ఈవెంట్ లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని..దేశవ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ పరిశ్రమల కోసం సీఐఐ కృషి చేస్తోందని అన్నారు. 65 కొత్త, అధునాతన స్కిల్ డెవిలప్మెంట్ సెంటర్లని తీసుకురాబోతున్నామని..ఎలాంటి స్కిల్స్ కావాలన్నది ఇండస్ట్రీ చెప్పాలని.. ఆయా కోర్సులను ఈ సెంటర్ లలో ఇంట్రడ్యూస్ చేస్తామని అన్నారు. ఇటీవల జరిగిన సమ్మిట్ ద్వారా తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పెట్టుబడుల వల్ల భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయని స్పష్టం చేశారు మంత్రి వివేక్.
►ALSO READ | అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యమని..ఇండస్ట్రీ లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. చిగాసి ఇండస్ట్రీ తర్వాత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని... ఇదంతా కార్మికుల సంక్షేమం కోసమేనని అన్నారు మంత్రి వివేక్. పరిశ్రమలు ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నానని అన్నారు. కార్మికుల కోసం కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని.. వాటిని ఇంప్లిమెంట్ చెయ్యాలని అన్నారు. కార్మికులు బాగుంటేనే… ఇండస్ట్రీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు మంత్రి వివేక్.
