తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం అద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని.. అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఇచ్చిన మహిళగా సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని చేసిన ఘనత సోనియాది అని అన్నారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను కాంగ్రెస్ గుర్తించిందని..అభివృద్ధి, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడంతో మహిళలదే కీరోల్ అని అన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా మహిళలకు ఇబ్బందులు తప్పడంలేదని అన్నారు సీఎం రేవంత్. సోషల్ మీడియా పెరగడంతో మహిళలపై వేధింపుల పరిధి పెరిగిందని అన్నారు. గతంలో వేధింపులు టౌన్లకే పరిమితమయ్యేదని అన్నారు.
►ALSO READ | Womens Day 2026 : పులిని కాళ్లతో తొక్కిపట్టి చంపిన వీర నారి.. రాయబాగిన్ రాణి శంకరమ్మ
మహిళా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి శక్తిని చాటి చెప్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అంతర్జాతీయ వేదికలు కల్పిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. సోలార్ ఉత్పత్తిలో మహిళా సంఘాలను భాగస్వామ్యులను చేశామని అన్నారు సీఎం రేవంత్. ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లను చేశామని.. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు అని అన్నారు. పెట్రోల్ పంపుల నిర్వహణ మహిళలకే అప్పగిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
