వామ్మో.. ఫైనల్ మ్యాచ్ ఆ మోదీ స్టేడియంలోనా.. ఇండియా కష్టమే అంటూ రచ్చ రచ్చ !

వామ్మో.. ఫైనల్ మ్యాచ్ ఆ మోదీ స్టేడియంలోనా.. ఇండియా కష్టమే అంటూ రచ్చ రచ్చ !

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచి ఫైనల్కు వెళ్లినప్పటికీ అభిమానులను మాత్రం ఒక విషయం టెన్షన్ పెడుతోంది. అదే.. ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం. ఈ స్టేడియం టీమిండియాకు అస్సలు కలిసి రావడం లేదని.. వేదిక మార్చాలని టీమిండియా అభిమానుల్లో కొందరు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి లేనప్పటికీ అహ్మదాబాద్ స్టేడియంపై అభిమానుల అసంతృప్తికి కారణం లేకపోలేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nitin Walke (@thenitinwalke)

2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఇదే స్టేడియంలో జరిగింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో 42 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను చిత్తు చేసి వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. ఈ మ్యా్చ్ రిజల్ట్ గుర్తొచ్చినప్పుడల్లా.. ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కదిలాడుతుంది. 137 పరుగులు చేసి ఎవరూ ఊహించని విధంగా టీమిండియాను ఘోరంగా దెబ్బ తీశాడు. టీమిండియా ఇలా కప్ చేజార్చుకున్న మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరిగింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sagar (@sagarcasm)

అంతెందుకు.. మొన్నటికి మొన్న సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిన మ్యాచ్కు కూడా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియమే వేదికగా నిలిచింది. ఇన్ని చేదు జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన స్టేడియం కావడంతో ఈ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ వద్దు బాబోయ్ అని టీమిండియా అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా గగ్గోలు పెడుతున్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరిగితే టీమిండియా ఓడిపోతుందనే భయం కొందరు టీమిండియా అభిమానులను వెంటాడుతుంది.