రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించడంతో సినీ ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణకు సంబంధించిన రెండు లోకల్ చిత్రాలైన రాజు వెడ్స్ రాంబాయి, దండోరా సినిమాలకు పట్టం కట్టి విజేతలుగా ప్రకటించడం విశేషం.
అలాగే, తండేల్ సినిమాలో నటించినందుకు గానూ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. తెలంగాణ కొత్త కోడలు రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. అయితే, ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించడం విశేషం.
నాగ చైతన్య తండేల్:
'తండేల్' సినిమా మత్స్యకారుల జీవితాలపై తెరకెక్కింది. దేశభక్తికి, ప్రేమకథను జోడించి దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన తర్వాత సముద్రంలో ఎదుర్కొనే సవాళ్లను దర్శకుడు కళ్లకు కట్టినట్లుగా సినిమాలో చూపించారు.
'THANDEL RAJU’ conquered hearts, earned accolades, and now receives the top honour ✨
— Geetha Arts (@GeethaArts) March 7, 2026
Yuvasamrat @chay_akkineni wins the BEST ACTOR award at the Gaddar Telangana Film Awards 2025 for his spectacular performance in #Thandel ❤️🔥#Dhullakottesadu#BlockbusterThandel… pic.twitter.com/0HSCiwPUEy
ఇందులో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య జీవించేశాడు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టాడు. సహజ నటి సాయి పల్లవి బుజ్జితల్లిగా మెప్పించింది. నిజజీవిత పాత్రలు ఐన రాజు-సత్యల కోసమే పుట్టినట్లుగా చై-సాయి పల్లవి మెప్పించారు. ఇద్దరూ శ్రీకాకుళం యాసలో సంభాషణలు అద్భుతంగా పలికారు.
తండేల్ కథ: 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది.
రష్మిక మందన్న- ది గర్ల్ ఫ్రెండ్:
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గానూ హీరోయిన్ రష్మిక మందన్న ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు గెలుచుకుంది. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న10 రోజుల లోపే, తెలంగాణ అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.
►ALSO READ | Gaddar Film Awards Full List
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నేటి సమాజానికి అవసరమైన అంశాన్ని ప్రతిబింబించే కథతో తెరకెక్కింది. ప్రేమ పేరుతో ఏర్పడే సంబంధాల్లో ప్రారంభంలోనే జాగ్రత్తగా ఉండకపోతే అమ్మాయిలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని ఈ చిత్రం చూపిస్తుంది.
ఇందులో రష్మిక మందన్న 'భూమా దేవీ' పాత్రలో ఒదిగిపోయింది. భిన్నమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసేలా చేసింది. డైరెక్టర్ రాసుకున్న భూమా దేవీ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. పెద్ద సూట్ కేస్‌ని ఈడ్చుకుంటూ హాస్టల్‌లో అడుగుపెట్టింది మొదలు.. క్లైమాక్స్‌లో భూమా విజృంభించే సీన్ వరకూ ప్రతి ఫ్రేమ్‌లో రష్మిక రష్మిక నటన ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఉత్తమ నటిగా గద్దర్ ఫిల్మ్ అవార్డు రష్మిక సొంతమైంది.
A deserving award to an outstanding performance ❤️@iamRashmika wins the BEST ACTRESS award at the Gaddar Telangana Film Awards 2025 ✨
— Geetha Arts (@GeethaArts) March 7, 2026
Her powerful portrayal of ‘Bhooma Devi’ in #TheGirlfriend resonated deeply with audiences and earned a standing ovation. @Dheekshiths… pic.twitter.com/SMrklKffll
