రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025’ విజేతలను ప్రకటించారు. శనివారం (మార్చి 7, 2026న) నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు అవార్డుల పూర్తి జాబితాను విడుదల చేశారు.
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 19న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఉత్తమ చిత్రం:
మొదటి ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
మూడవ ఉత్తమ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ )
స్పెషల్ జూరీ అవార్డులు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు -చిరంజీవి
సినారె అవార్డు - సుద్దాల అశోక్ తేజ
పైడి జయరాజ్ అవార్డు- కమలహాసన్
బి.ఎన్.రెడ్డి అవార్డు -సంగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అశ్వినిదత్
ఏఎన్నార్ అవార్డు - జయసుధ
కాంతారావు అవార్డు- ఆర్ నారాయణ మూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు - రమేష్ ప్రసాద్
గద్దర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్:
నేషనల్ ఇంటిగ్రిటీ మూవీ – తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ మూవీ – కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమిక
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – మార్క్ కె రాబిన్ (దండోరా)
బెస్ట్ సింగర్ – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ ఫిమేల్ సింగర్ – సాహితి చాగంటి (కన్నప్ప)
బెస్ట్ కమెడియన్ – కృష్ణ తేజ (జిగ్రీస్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
బెస్ట్ స్టోరీ రైటర్ – గుణశేఖర్ (యుఫోరియా)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి
బెస్ట్ లిరిక్ రైటర్ – నందకిశోర్ (కుబేర)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
బెస్ట్ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – ఆట సందీప్ (గిర గిర గిర)
బెస్ట్ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చాంపియన్)
బెస్ట్ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
స్పెషల్ జ్యూరీ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
స్పెషల్ జ్యూరీ హీరోయిన్ – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్)
