ఢిల్లీ గఫార్ మార్కెట్లో అగ్నిప్రమాదం..తగలబడిన షాపులు..భయంతో పరుగులు పెట్టిన కస్టమర్లు

ఢిల్లీ గఫార్ మార్కెట్లో అగ్నిప్రమాదం..తగలబడిన షాపులు..భయంతో పరుగులు పెట్టిన కస్టమర్లు

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ( సెప్టెంబర్​ 15) మధ్యాహ్నం ఢిల్లీ కరోల్​ బాగ్​ ప్రాంతంలోని గఫార్​ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలు షాపులు తగలబడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయంతో పరుగులుపెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రాణనష్టం, ఆస్తినష్టం గుర్తించలేదు.