
Gold Price Today: అక్టోబర్ మెుదటి వారంలో తెలుగు ప్రజలు జరుపుకునే దసరా వచ్చేస్తోంది. చాలా మంది దసరా నాటికి బంగారం లేదా వెండికి సంబంధించిన వస్తువులు, ఆభరణాలు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పండక్కి ముందు బంగారం, వెండి రేట్లలో భారీ పెరుగుదలతో దీనికి కారణాలు ఏంటి, రానున్న రోజుల్లో రేట్లు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..
సెప్టెంబర్ 17న జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశంపై అందరి దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు గరిష్ఠాల వద్ద మరింత పెరగటానికి సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం, టారిఫ్స్ ప్రభావంపై పెట్టుబడిదారులు ఫోకస్ పెట్టారు. రానున్న రోజుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆప్ జపాన్ బంగారం రేట్లకు దిశానిర్థేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా 4వ వారంలో కూడా బంగారం స్పా్ట్ మార్కెట్లో ర్యాలీని కొనసాగిస్తోంది. ఇదే సమయంలో వెండి కూడా బంగారం దారిలోనే కొనసాగుతూ భారీ పెరుగుదలను చూస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 14తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 15న రూ.110 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.11 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 15న):
హైదరాదాబాదులో రూ.11వేల 106
కరీంనగర్ లో రూ.11వేల 106
ఖమ్మంలో రూ.11వేల 106
నిజామాబాద్ లో రూ.11వేల 106
విజయవాడలో రూ.11వేల 106
కడపలో రూ.11వేల 106
విశాఖలో రూ.11వేల 106
నెల్లూరు రూ.11వేల 106
తిరుపతిలో రూ.11వేల 106
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 14తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 15న 10 గ్రాములకు రూ.100 తగ్గుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 15న):
హైదరాదాబాదులో రూ.10వేల 180
కరీంనగర్ లో రూ.10వేల 180
ఖమ్మంలో రూ.10వేల180
నిజామాబాద్ లో రూ.10వేల 180
విజయవాడలో రూ.10వేల 180
కడపలో రూ.10వేల 180
విశాఖలో రూ.10వేల 180
నెల్లూరు రూ.10వేల 180
తిరుపతిలో రూ.10వేల 180
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 15న తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 43వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.143 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.