వామ్మో.. ఒక్క యాక్సిడెంట్.. గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు !

వామ్మో.. ఒక్క యాక్సిడెంట్.. గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు !

బిలాస్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పరిధిలో ఘోరం జరిగింది. ఒక భారీ డంపర్ వెహికల్ అదుపు తప్పి డివైడర్ దాటి ఇవతల పక్కకు వచ్చింది. అదే సమయంలో ఒక స్కార్పియో కారు అతి వేగంగా వెళుతూ ఈ డంపర్ వాహనాన్ని ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. డంపర్ వెహికల్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 27న 2.42 am టైంలో ఈ ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్కు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కన ఉన్న దాబాలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇంటర్నెట్లో ఈ యాక్సిడెంట్ వీడియో వైరల్ అయింది. అయితే.. ఈ వీడియోను గమనిస్తే కంటైనర్ అదుపు తప్పి డివైడర్ దాటి ఇవతలకు రావడానికి కారణం ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ కంటైనర్ను వెనుకగా వస్తున్న మరో కంటైనర్ రోడ్డు పక్కన ఓవర్ టేక్ చేసే ఖాళీ లేకపోయినా ఓవర్ టేక్ చేసిందని.. ఆ కంటైనర్కు దారివ్వడం కోసం పూర్తిగా ఈ పక్కకు వచ్చిన క్రమంలో కంటైనర్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు దాటడంతో ప్రమాదం జరిగిందని వీడియో చూసిన నెటిజన్లు చెప్పుకొచ్చారు.