World Cup 2026: డూ ఆర్ డై మ్యాచులో తేలిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్స్.. బౌలర్లపైనే భారమంతా..!

World Cup 2026: డూ ఆర్ డై మ్యాచులో తేలిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్స్.. బౌలర్లపైనే భారమంతా..!

కొలంబో: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో‎ భాగంగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న మ్యాచులో న్యూజిలాండ్ మోస్తారు స్కోర్‎కే పరిమితమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతోన్న ఈ డూ ఆర్ డై మ్యాచులో న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు.

 ఇంగ్లాండ్ బ్యాటర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సీఫెర్ట్ (35), ఫిన్ అలెన్ (29), గ్లెన్ ఫిలిఫ్స్ (39) రాణించారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో కివీస్ భారీ చేయలేకపోయింది. 

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. లియామ్ డాసన్ ఒక వికెట్ పడగొట్టాడు. భీకర ఫామ్‎లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్లను న్యూజిలాండ్ బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి మరీ.