క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్: మార్చి 28న ఐపీఎల్ 2026 స్టార్ట్.. మే 31న ఫైనల్..!

క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్: మార్చి 28న ఐపీఎల్ 2026 స్టార్ట్..  మే 31న ఫైనల్..!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం ఎదురు చూస్తోన్న క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మే  31న ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26న మొదలు అవుతుందని మొదట ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ ఏడాది సమ్మర్‎లో అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్‎ను ఈసీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో ఐపీఎల్ 2026 ప్రారంభం తేదీని మరో రెండు రోజులకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఐపీఎల్ షెడ్యూల్‎ను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‎ను ఈ సారి  రెండు భాగాలుగా ప్రకటించనున్నట్లు సమాచారం.