నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 961 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. రూ.4,91,886 కోట్లు ఆవిరి..

 నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 961 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. రూ.4,91,886 కోట్లు ఆవిరి..

 స్టాక్ మార్కెట్  ఈరోజు (ఫిబ్రవరి 27)భారీ పతనంతో ముగిసింది. సెన్సెక్స్ 961 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 317 పాయింట్లు పడిపోయింది.  బిఎస్‌ఇ సెన్సెక్స్ 961.42 పాయింట్లు (1.17%) తగ్గి 81,287.19 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 82,246.17 గరిష్ట స్థాయిని చేరుకొని.. 81,159.15 కనిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 317.90 పాయింట్లు (1.25%) తగ్గి 25,178.65కి చేరుకుంది. బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీలు ఈరోజు రూ.491,886.39 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

సెన్సెక్స్ కంపెనీలలో సన్ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండిగో, మారుతి భారీ క్షీణతను చవిచూశాయి. హెచ్‌సిఎల్ టెక్నాలజీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఎన్‌టిపిసి షేర్లు లాభాలను నమోదు చేశాయి.

 నిన్న  సెన్సెక్స్ 82,248.61 పాయింట్ల వద్ద ముగియగా.. ఈరోజు ఉదయం  82,220.48 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్  81,159.15 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయి.. 82,246.17 గరిష్ట స్థాయికి చేరుకుంది.

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు
*
FII అమ్మకాలు
*బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాలు
*అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం
*రూపాయి విలువ తగ్గుదల