Prabhas Spirit: ప్రభాస్‌ను ఢీకొట్టే మాఫియా డాన్‌గా వివేక్ ఒబెరాయ్! 'స్పిరిట్' నుంచి పవర్‌ఫుల్ లుక్ రిలీజ్!

Prabhas Spirit: ప్రభాస్‌ను ఢీకొట్టే మాఫియా డాన్‌గా వివేక్ ఒబెరాయ్! 'స్పిరిట్' నుంచి పవర్‌ఫుల్ లుక్ రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ , సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ వస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ (Spirit). వీరి కాంబోలో ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయికి చేశారు. 'బాహుబలి'తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన డార్లింగ్, 'యానిమల్'తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ కలిసి చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయం అని ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు గట్టి ధీమాగా ఉన్నాయి.  లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి వెలువడిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

వివేక్ ఒబెరాయ్ 'బాడ్ యాస్' లుక్!

ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే ఉత్సాహం అందరిలోనూ ఉండగా, తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సందీప్ వంగా విడుదల చేశారు. చేతిలో కత్తి పట్టుకుని, స్టైలిష్‌గా కనిపిస్తున్న వివేక్ ఒబెరాయ్ లుక్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ పోస్టర్‌లో ఆయనతో పాటు నటి ఐశ్వర్య దేశాయ్ కూడా కనిపించి ఆసక్తిని రేకెత్తించారు. 'రక్త చరిత్ర' వంటి సినిమాలతో తనలోని నెగటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించిన వివేక్, ప్రభాస్‌ను ఎదుర్కొనే పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా స్పిరిట్‌లో కనిపించనున్నారు.

 

సరికొత్త పోలీస్ అవతారంలో డార్లింగ్!

ప్రభాస్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఇందులో ఆయన గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత కరుడగట్టిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. కేవలం పోలీస్ కథే కాకుండా, దీనికి అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యాన్ని కూడా సందీప్ వంగా జోడించారట. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, సందీప్ వంగా మార్క్ రా (Raw) అండ్ రస్టిక్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తుంది.

భారీ తారాగణం..

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కేవలం భారత్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ 2027 మార్చి 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. యానిమల్ తర్వాత సందీప్ వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో, 'స్పిరిట్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.