తెలంగాణలో మరో మూడు రోజులు.. వర్షాలే వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు.. వర్షాలే వర్షాలు

తెలంగాణలో గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా లేవు. ఎందుకంటే ఇంకా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ( సెప్టెంబర్ 14) ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. మిగతా జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  రేపు(సెప్టెంబర్ 15) ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 16న పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. 

 ఇవాళ (సెప్టెంబర్ 14) ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిలాల్లో మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే విధంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని తెలిపారు.

ఇటు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు,  నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి,  సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.