కోమాలో మాజీ సీఎం అజిత్‌ జోగి

కోమాలో మాజీ సీఎం అజిత్‌ జోగి
  1. వెల్లడించి డాక్టర్లు

రాయ్‌పూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కోమాలోకి వెళ్లిపోయారని ఆయనకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున డాక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఆయన న్యూరలాజికల్‌ యాక్టివిటీ కూడా సరిగా లేదని, వెంటిలేటర్‌‌పైన ఉన్నారని డాక్టర్లు చెప్పారు. హార్ట్‌ఎటాక్‌ రావడంతో శనివారం ఆయన్ను శ్రీ నారాయణ హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం హార్ట్‌ ఫంక్షనింగ్‌ బాగానే ఉందని, బీపీ కూడా కంట్రోల్‌కు వచ్చిందని అన్నారు. కానీ బ్రెయిన్‌కు ఆక్సిజన్‌ అందటం లేదని చెప్పారు. “ జోగి న్యురాలాజికల్‌ యాక్టివిటీ పూర్తిగా పడిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన కోమాలోకి జారుకున్నారు. వెంటిలేటర్‌‌పైన ఉన్నారు. ఆయన్ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం” అని హాస్పిటల్‌ డైరెక్టర్‌‌ సునిల్‌ ఖెమ్కా హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి మొదటి సీఎం అజిత్‌జోగి. 2003 నవంబర్‌‌ వరకు ఆయన సీఎంగా వ్యవహరించారు. 2016లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన సొంతంగా జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జే) పేరుతో పార్టీ పెట్టారు. 2004లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అజిత్‌ తీవ్రంగా గాయపడి.. అప్పటి నుంచి వీల్‌చైర్‌‌కి పరిమితమయ్యారు.