ప్రజల మద్దతు తమకే ఉందన్న ఎస్పీ చీఫ్ 

 ప్రజల మద్దతు తమకే ఉందన్న ఎస్పీ చీఫ్ 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ చీఫ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పించారు. భారత శిక్షాస్మృతిలో ఉన్న సెక్షన్ల కంటే సీఎం యోగి, డిప్యూటీ సీఎంపై ఎక్కువ అభియోగాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైనా వారిపై పిటిషన్ వేస్తే వారిపై ఉన్న కేసులను పరిశీలిస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసు వాహనాల సంఖ్యను రెట్టింపు చేస్తామని చెప్పారు. దీంతో నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. ఎస్పీ, ఆర్ ఎల్ డీ కూటమికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు చూసి బీజేపీ తట్టుకోలేకపోతుందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో కమలనాథులు ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని అఖిలేష్ ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం

అస్సాంలో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు

భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి