అస్సాంలో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు

అస్సాంలో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు

ఫిబ్రవరి 15, 2022 నుండి స్కూల్స్ తిరిగి తెరవనున్నట్లు ప్రకటించారు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ. రాష్ట్రంలో కరోనా  పరిస్థితులు తగ్గుదలను బట్టి ఇప్పటికే విధించిన కర్ఫ్యూని సడలిస్తామని కూడా తెలిపారు. అస్సాంలో కరోనా  కేసులు కొనసాగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 2,000కి చేరుకుంది. కేసుల్ని తగ్గించటానికి తగిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

కేసులు తగ్గుదలను బట్టి ప్రస్తుతం రాత్రి 10 గంటల నుండి కర్ఫ్యూ సమయాలు రాత్రి 11 గంటల వరకు సడలించబడతాయని సీఎం ప్రకటించారు.  అస్సాంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ఈ జనవరి 25 నుండి స్కూల్స్ లో 8వ తరగతి వరకు ఆఫ్ లైన్ క్లాసులు నిలిపివేశారు. ఈక్రమంలో మూతపడిన క్లాసులు తిరిగి ఫిబ్రవరి 15 నుండి తెరవబడతాయని సీఎం తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

బూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేసీఆర్