హాలియా, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నింపేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి గురువారం నీటి విడుదల ప్రారంభించారు. రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు మొత్తం 0.7 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు పరిధిలో తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేసినట్లు ఎన్ఎస్పీ ఆఫీసర్లు తెలిపారు. మరో వైపు సాగర్ నీటి మట్టం ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉందని, ఇప్పుడు వారం రోజుల పాటు నీటిని విడుదల చేస్తే రిజర్వాయర్ నీటి మట్టం మరింత తగ్గే ప్రమాదం ఉందని సాగర్ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
