జ్యోతిష్యం:శని.. శుక్రుడు మధ్య నవపంచమ యోగం.. 12 రాశుల వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్యం:శని.. శుక్రుడు మధ్య నవపంచమ యోగం.. 12 రాశుల  వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  2026 జూన్​ 25 న నిర్జల ఏకాదశి రోజున  నవ పంచమ యోగం ఏర్పడింది. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో, శని మీన రాశిలో  36 డిగ్రీల దూరంలో  ఉండటం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య నవ పంచమ యోగం ఏర్పడింది. ఈ శుభ యోగం 6  రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. .. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ..  శుక్రుడు సంతోషం, శ్రేయస్సు, డబ్బు, విలాసాలను కలుగజేస్తాడు. అయితే శని దేవుడు న్యాయం, క్రమశిక్షణ, కర్మ, కష్టపడి పనిచేయడం వంటి విషయాలతో  ఇవ్వడంతో సంబంధం కలిగి ఉంటాడు. ప్రస్తుతం ఏర్పడిన ఈ నవపంచమ యోగం 12 రాశుల వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

మేషరాశి.. శుక్రుడు.. శ‌ని గ్రహాలమధ్య నవపంచమయోగం  క‌లిసి సంచ‌రించ‌డం వ‌ల‌న ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.  కోర్టు వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చేసే వారికి.. ఉద్యోగ‌స్తుల‌కు ఆర్థికంగా  క‌ల‌సి వ‌స్తుంది.  ఆదాయం పెరుగుతుంది.  విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగ‌స్తుల‌కు వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంటుంది.  మొండి బ‌కాయిలు వ‌సూల‌వుతాయి. 

వృషభం: శుక్రుడు, శ‌ని.. మధ్య ఏర్పడిన నవమపంచమయోగం వలన ఈ రాశివారికి  అధ్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని.  ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొందుతారు.  ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్ తో వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంది.  కేరీర్ లో ఉన్న‌త‌స్థానాన్ని పొందుతారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మిమ్మ‌ల‌ను వ్య‌తిరేకించిన వారే మీ స‌హాయాన్ని అర్దిస్తారు.  ఆక‌స్మికంగా ధ‌న‌లాభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశిః శుక్రుడు.. శ‌ని గ్రహాల మధ్య ఏర్పడిన నవపంచమయోగం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది.  అయితే ప‌ని ఒత్తిడి.. శ్రమ అధికం అవుతుంది.  కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ప‌రిష్కార‌మ‌వ‌వుతాయి.  తండ్రి వైపు నుంచి ఆస్తి ల‌భిస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్ రావ‌డంతో పాటు వేత‌నం పెరుగుతుంది. వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెడ‌తారు.  విదేశాల‌లో ఉద్యోగం చేసే వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కెరీర్ ప‌రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల‌ని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

 క‌ర్కాట‌క రాశిః  శుక్రుడు.. శ‌ని గ్రహాల మధ్య ఏర్పడిన నవమ పంచయోగం వలన ఈ రాశి వారికి కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి.  కెరీర్ లో మంచి మార్పులు క‌లుగుతాయి.  ఉద్యోగ‌స్తుల‌కు.. వ్యాపార‌స్తుల‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యక్తిగ‌త జీవితంలో ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు  తీసుకోవద్దు. పెండింగ్ ప‌నులు అతిక‌ష్టంమీద పూర్తి చేయ‌గ‌లుగుతారు.  ఉద్యోగ‌స్తులు ఎవ‌రితోనూ ఎలాంటి వాద‌న‌లు పెట్టుకోవ‌ద్దని పండితులు సూచిస్తున్నారు.  వ్యాపార‌స్తులకు మిశ్రమ ఫ‌లితాలుంటాయి.  స‌మాజంలో కీర్తి గౌరవం పొందుతారు. 

సింహ‌రాశిః శుక్రుడు.. శ‌ని గ్రహాల మధ్య నవ పంచమయోగం వలన ఈ రాశి వారికి మంచి సంబంధం కుదురుతుంది.  ఆఫీసులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గ‌డుపుతారు. మీ ల‌క్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయ‌త్నాలు కొన‌సాగిస్తారు.  ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి పెరుగుతుంది... కాని వాటిని చ‌ర్చించి ప‌రిష్కరించుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తే మంచి లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.  

కన్యారాశిః  శుక్రుడు.. శ‌ని గ్రహాల మధ్య నవపంచాగం యోగంలన ఈ రాశి వారు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు అప్రమ‌త్తంగా ఉండాలి. ఉద్యోగ‌స్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్యత‌లు తీసుకొనే అవ‌కాశం క‌ల‌దు.  ఆదాయం పెరుగుతుంది.  ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.  వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేవిష‌యాన్ని వాయిదా వేసుకోవ‌డం  మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు.

తులారాశి: శుక్రుడు.. శని గ్రహాల మధ్యన  నవపంచమ యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి పని, వృత్తి  కీర్తికి సంబంధించిన  విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  .చేతి వృత్తుల వారికి అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి.  సంతానం కోసం ఎదురు చూసే వారు శుభ‌వార్త వింటారు.  వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి.  కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేందుకు  చాలా అనుకూలంగా ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకోకుండా ఆర్డర్లు వ‌స్తాయి. ఉద్యోగ‌స్తులకు ప‌నిభారం అధిక‌మ‌వుతుంది.  స‌హోద్యోగ‌ల అండ‌దండ‌లు ఉంటాయి.  మీ బాస్ మీకు కొన్ని కీల‌క‌మైన ప‌నులు అప్పగించే అవ‌కాశం ఉంటుంది.  ఇది మీ లైఫ్ న‌కు ట‌ర్నింగ్ పాయింట్ కూడా అవ్వ‌వ‌చ్చు. కాబ‌ట్టి అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను ఇష్టంగా స్వీక‌రించండి. 

వృశ్చిక రాశిః  శుక్రుడు.. శని గ్రహల మధ్య నమపంచమయోగం వలన ఈ రాశి వారికి అదృష్టం వరించనుంది.  ఈ రాశి వారు కొత్త ఆలోచలను అమలు చేస్తే  వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా పెంచుతుంది.  దూర ప్రాంత ప్రయాణాలు చాలా  ప్రయోజనకరంగా ఉంటాయి. నవమపంచమయోగం వలన ఇప్పటి వ‌ర‌కు అస్తిరంగా ఉన్న ఉద్యోగంలో.. స్థిర‌త్వం ఏర్ప‌డుతుంది.  వేత‌నం పెరుగుతుంది.  అదనపు ఆదాయ మార్గాలు మెరుగైన ఫలితాలనిస్తాయి.

ధ‌న‌స్సు రాశిః   నవపంచమ యోగం ఈరాశి వారు  ఆర్థిక విషయాల్లో శ్రద్ద పెట్టాలని పండితులు చెబుతున్నారు.  ఆస్తుల మ‌ధ్య వివాదాలు వ‌స్తాయి.    ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. . స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. అనవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి.   ఎవ‌రితోనూ ఎలాంటి వాద‌న పెట్టుకోకుండా దైవ చింత‌న‌తో గ‌డ‌పండి . దేవుడిపై భారం వేసి మీ ప్ర‌య‌త్నాల‌ను మీరు కొన‌సాగించండి  కాల‌మే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతుంది.  

మ‌క‌ర‌రాశిః శుక్రుడు... శ‌ని గ్రహాలమధ్య 36 డిగ్రీల దూరంలో నవమ పంచమయోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి  వారికి సంతోషం... ధ‌న సంప‌ద ల‌భిస్తాయి.  దైవానుగ్ర‌హంతో పెండింగ్ ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. ఉద్యోగం మారే అవ‌కాశం ఉంటుంది.  మీకుటుంబంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. వ్యాపారస్తులు..కొత్తగా పెట్టుబ‌డులు పెట్టడంవంటివి జ‌రుగుతాయి.  ఈ రాశి వారికి పెద్ద మొత్తంలో లాభం వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

కుంభ‌రాశిః శని గ్రహం సొంత రాశి.. శుక్రుడితో కలిసి నవ పంచమ యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి చాలా శుభ ఫ‌లితాలుంటాయని పండితులు చెబుతున్నారు. . జీవిత‌భాగ‌స్వామికోసం స‌మ‌యాన్ని కేటాయిస్తారు. ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది.  కొన్ని కొత్త కార్యక్రమాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆనందంతో పాటు సంప‌ద పెరుగుతుంది.  పెండింగ్ ప‌నులు పూర్తికావ‌డంతో కొంత ఊర‌ట క‌లుగుతుంది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఆరోగ్య స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. 

మీనరాశిః   శుక్రుడు.. శ‌ని గ్రహాల మధ్య ప్రత్యేకమైన యోగం ఏర్పడటం వలన ఈరాశి వారికి  ఆర్థిక పరంగా స‌మ‌స్యలు ఏర్పడుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చులు పెరుగుతాయి.  కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి.  ఆర్థిక విష‌యాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ స‌భ్యల మ‌ధ్య వివాదాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.  మీలో మీరే కూర్చుని ప‌రిష్కరించుకోండి.. మూడో వ్య‌క్తి ద‌గ్గర‌కు ప‌రిష్కారం కోసం వెళ్లవ‌ద్దని పండితులు సూచిస్తున్నారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.