పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఇప్పటి వరకు ఉన్న రూ.1500కు చెల్లిస్తుండగా ఇకపై 2వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ సేవ ద్వారా పాస్‌పోర్ట్ పొందాలంటే రూ.5వేలు చెల్లించాలి. ఇదివరకు ఈ ఫీజు రూ.3వేల 500గా ఉంది. 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణ కేటగిరీలో రూ.3వేల500, తత్కాల్‌లో రూ.6వేల ఫీజుగా నిర్ణయించారు.
పోగొట్టుకున్న లేదా పాడైన పాస్‌పోర్ట్ స్థానంలో కొత్తది పొందాలనుకునే వారికి కూడా ఈ ఫీజులు వర్తిస్తాయి. 18 ఏళ్లలోపు పిల్లలకు 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణంగా రూ.1,750, తత్కాల్‌లో రూ.4వేల250 చెల్లించాలి. మైనర్లకు అయితే పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందేందుకు సాధారణంగా రూ.4వేల250, తత్కాల్‌లో రూ.6వేల750 ఫీజు చెల్లించాలి.
►ALSO READ | పాస్‌పోర్ట్, ఆధార్ ఉన్నంత మాత్రాన మీరు భారత పౌరులు కాదా? అసలు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలేవి?
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), సరెండర్ సర్టిఫికేట్ వంటి పాస్‌పోర్ట్ సంబంధిత సేవలకు రూ.750 ఫీజునిర్ణయించారు. గత పద్నాలుగు ఏళ్లలో పాస్ పోర్టు ఫీజులు పెంచడం ఇదే తొలిసారి. 2012 తర్వాత మొదటి భారీగా పెంచారు. జూలై 1 నుంచి దరఖాస్తు చేసుకునే వారందరికీ ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
