ఉద్యోగులకు కోటిన్నర బీమా..అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పెన్షనర్లకూ వర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగులకు కోటిన్నర బీమా..అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పెన్షనర్లకూ వర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్  చెప్పారు సీఎంరేవంత్ రెడ్డి. ఉద్యోగులు ప్రమాదంలో చనిపోతే  కోటిన్నర బీమా ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఆదిశగా ముందడుగు వేశారు. బ్యాంకులను ఒప్పించి గురువారం (జూన్ 25) బీమా ఎంఓయూపై  సంతకం చేశారు.ఈ బీమాతో 15 లక్షల మంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ బీమా వర్తించనుంది.  తొలుత సింగరేణి సంస్థలో ఈ బీమాను  ప్రారంభించారు. ఇప్పటికే 45 మంది సింగరేణి కార్మికులు చనిపోతే కోటిన్నర బీమా చెల్లించారు.  

►ALSO READ | విమాన ప్రమాదం జరిగితే రూ. 3 కోట్లు.. దేశంలోనే మొదటిసారి.. తెలంగాణ చారిత్రాత్మక ఒప్పందం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  ఉద్యోగులకు కోటిన్నర బీమా అమలులో డిప్యూటీసీఎం భట్టి కృషి ఎంతో ఉందన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు.. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుత ఈ బీమా అమ లుపై అనేక సందేహాలున్నా.. తర్వాత ఉద్యోగులకు సంక్షేమమే లక్ష్యంగా  ఎంతో కసరత్తు చేశామన్నారు. బ్యాంకర్లను ఒప్పించి ఈ బీమాను కల్పించామన్నారు సీఎం.  మరోవైపు విమాన ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగులకు  రూ.3కోట్ల బీమా కల్పిస్తున్నామని  చెప్పారు.