పెరిగిపోతున్న సిజేరియన్లు : తెలంగాణలో ఎంత శాతం నమోదయ్యాయంటే

పెరిగిపోతున్న సిజేరియన్లు : తెలంగాణలో ఎంత శాతం నమోదయ్యాయంటే

డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీ చేయించుకునేందుకు గర్భిణీ లు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2019–2020లో ఈ సిజేరియన్ లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రతీ ఐదుగురు పసికందుల్లో నలుగురు పిల్లల సిజేరియన్ ద్వారా జన్మిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ హెచ్ ఎస్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేల్లో ఎక్కువగా వెస్ట్ బెంగాల్ లో (83శాతం), జమ్ము– కాశ్మీర్ లో (82 శాతం), తెలంగాణలో (81.5 శాతం) మంది ఉన్నారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులలో అవుతున్న సిజేరియన్ల కంటే ప్రైవేట్ ఆస్పత్రులలో అవుతున్న సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇక  తెలంగాణ లో  సీ‌ – సెక్షన్ డెలివరీలు  ప్రభుత్వ ఆస్పత్రులలో 45శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. అస్సోం  ప్రైవేట్ ఆస్పత్రులలో సీ– సెక్షన్ డెలివరీలు 53శాతం నుంచి 71శాతానికి పెరిగింది. వెస్ట్ బెంగాల్ లో 71శాతం నుంచి 83శాతం ఉండగా, గుజరాత్ లో అతి తక్కువగా 31శాతం మంది సిజేరియన్ డెలివరీ అవుతున్నాయి.

5వ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను కేంద్ర మంత్రి హర్షవర్దన్ విడుదల చేశారు. కాగా కేంద్రం ఈ సర్వేను 1985 నుంచి నిర్వహిస్తుంది.