హైదరాబాద్ లో ‘అమెజాన్ మెటావరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్ లో ‘అమెజాన్  మెటావరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్) లో భాగంగా అమెజాన్ ఇండియా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన వినియోగదారుల కోసం 'ది అమెజాన్ మెటావరల్డ్' ను గురువారం ప్రదర్శించింది. ఈ విధానంలో అమెజాన్ వర్చువల్ రియల్టీ ద్వారా కస్టమర్లు తమ ప్రొడక్టులను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొనే వస్తువులు ఇంటిలో  పెడితే ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఐఐటీ స్టూడెంట్లు పాల్గొని మెటావరల్డ్ అనుభూతిని పొందారు.

అమెజాన్ ఇండియా డైరెక్టర్, కిషోర్ తోట ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘11 లక్షల మంది సెల్లర్లు,  2 లక్షల లోకల్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ‘ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ జరుగుతోంది.   భారతీయ ఎస్ఎంబీలు, స్థానిక స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుండి కోట్లాది ప్రొడక్టులను వినియోగదారులకు అమెజాన్ అందిస్తోంది. పోయిన ఏడాదితో పోలిస్తే తెలంగాణ వినియోగదారులకు సేవలందిస్తున్న సెల్లర్ల సంఖ్య 25 శాతం పెరిగింది.  అమెజాన్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలు  ఒక ముఖ్యమైన మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని అన్నారు.