కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి వింత అనుభవం

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి వింత అనుభవం

పెద్దమనసు చాటుకున్న మంత్రి స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన సొంత నియోజకవర్గమైన యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న సందర్భంగా వింత అనుభవం ఎదురైంది. నియోజకవర్గ ప్రజలు హాజరైన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడబోతున్న టైమ్ లో ఓ మహిళ నేరుగా వచ్చి ఆమె కళ్లపై పడింది. ఆమెతో పాటు..కుటుంబసభ్యులు కూడా స్టేజీపైకి వచ్చారు. వద్దమ్మా.. వద్దు లే అంటూ స్మృతి ఇరానీ ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు. కాళ్లను వదల్లేదు. అధికారులు చెప్పినా కూడా ఆమె ఏడుస్తూ.. స్మృతి ఇరానీ కాళ్లను పట్టుకుని ప్రాధేయపడింది.

నీకే సాయమైనా చేస్తాను.. లేమ్మా.. నేనున్నా అంటూ ఆమెను లేవదీసి ఓదార్చి వివరాలు అడిగారు స్మృతి ఇరానీ. తమకు చెందిన భూమిని.. కుటుంబసభ్యులు అక్రమంగా లాక్కున్నారనీ.. న్యాయంగా అది తమకు దక్కుతుందని ఆమె మంత్రికి చెప్పుకుంది. ఈ విషయంపై అక్కడే ఉన్న అధికారులను పిలిపించి మాట్లాడారు మంత్రి. కంప్లయింట్ తీసుకోవాలని చెప్పి.. సమస్యను పరిష్కరిస్తానని ఆ మహిళకు హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా దృష్టిపెట్టి న్యాయం జరిగేలా చూస్తానని.. అధైర్య పడొద్దని.. భరోసా ఇచ్చారు.

ఓ మహిళా పేషెంట్ ను తన కాన్వాయ్ అంబులెన్స్ లో తీసుకెళ్లిన స్మృతి ఇరానీ

ఇదే పర్యటనలో తన పెద్దమనసు చాటుకున్నారు స్మృతి ఇరానీ. ఓ మహిళ అనారోగ్యంతో నడవలేకపోవడం చూసి.. కాన్వాయ్ ఆపారు. విషయం తెల్సుకుని తన కాన్వాయ్ అంబులెన్స్ లో ఆమెను దగ్గరుండి ఎక్కించి.. హాస్పిటల్ కు పంపించారు. మంత్రుల కాన్వాయ్ కారణంగా అంబులెన్స్ లు లేటవుతుంటాయికానీ… అంబులెన్స్ నే సామాన్యుల కోసం పంపించడం మంత్రి నిజంగా గొప్పే అని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు.