కేంద్ర సర్వీసులకు ఆమ్రపాలి

కేంద్ర సర్వీసులకు ఆమ్రపాలి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి కాట డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఢిల్లీలోని కేబినెట్ సెక్రటరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా ఆమె అపాయింట్ అయ్యారు. ఈ పోస్టులో నాలుగేళ్లపాటు పని చేయనున్నారు. 2010 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆమ్రపాలి ఐఏఎస్‌‌‌‌‌‌‌‌గా శిక్షణ పూర్తి చేసుకున్నాక తొలుత వికారాబాద్ సబ్‌‌‌‌‌‌‌‌కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, తర్వాత కొంతకాలం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జాయింట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ అయ్యారు.  ప్రస్తుతం తెలంగాణ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌లో జాయింట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు