సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు

సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు

సిక్కింలోని యుక్సోమ్‌కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఇది ఉదయం 4.15గంటలకు రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. ఈ భూ ప్రకంపనలతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. సాధారణంగా రిక్టర్ స్కేలుపై 4 పాయింట్లు నమోదైన భూకంపాలను చినన భూకంపాలుగా పరిగణిస్తారు. అలా చూస్కుంటే ఇది చిన్న భూకంపం కిందే లెక్క. దీని వల్ల పెద్ద మొత్తం ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగకపోవచ్చు. కానీ ఇటీవల టర్కీలో వచ్చిన భూకంపంతో దాదాపు 24వేలకు పైగా మంది మరణించారు. ఆదివారం అస్సాంలోనూ భూకంపం రావడంతో జనం ఆందోళన చెందుతున్నారు.