యూపీ ప్ర‌మాద మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల ప‌రిహారం

యూపీ ప్ర‌మాద మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల ప‌రిహారం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనిఔరయాలో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ వలస కూలీల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం. అలాగే గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున సాయం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ న‌గ‌దు అందించేందుకు యూపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని పీఎంవో ట్వీట్ చేసింది.

యూపీలోని ఔరయా వద్ద శనివారం తెల్లవారు జామున 3 గంటల 15 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఈ ఘటనలో 24 మంది చనిపోగా.. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఔరయా రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. ఆ ఘటనలో మృతుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నా.. గాయపడిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నా’ అని శ‌నివారం ఉద‌యం ఆయ‌న ట్వీట్ చేశారు. మోడీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్ కూడా సంతాపం తెలిపారు.