ఇల్లు కూలుస్తుంటే వెండి నాణేలు దొరికినయ్

ఇల్లు కూలుస్తుంటే వెండి నాణేలు దొరికినయ్

తాండూరు, వెలుగు: పాత ఇంటిని కూల్చివేస్తుండగా వెండి నాణేలు బయటపడిన సంఘటన పాత తాండూరులో జరిగింది. నారా రామచంద్రయ్యకు చెందిన పాత ఇంటిని ఇటీవల మరో వ్యక్తి కొన్నారు. దానిని బుధవారం కూల్చివేస్తుండగా రెండు బొక్కనల వెండి, బంగారు నాణేలు దొరికినట్లు తాండూరులో పుకార్లు వ్యాపించాయి. పోలీసులు బుధవారం రాత్రి  జేసీబీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి సమాచారం మేరకు వాటిని దాచిపెట్టిన స్థలానికి ఎస్సై గఫార్, సిబ్బంది వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. వాటిని లెక్కించి 571 వెండి నాణేలు ఉన్నట్లు నిర్ధారించారు.