
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule). వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన పుష్ప భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదలైన పుష్ప టైటిల్ సాంగ్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. పాటలో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.
దీంతో పుష్ప టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. కేవలం ఇండియాలోనే కాదు ఈ పాటకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వస్తోంది. అందుకే ఈ పాట విదేశాల్లో సైతం ట్రెండ్ అవుతుంది. పాట రిలీజయిన కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధించింది ఈ సాంగ్. ఇదే విషయాని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్.. 1.27 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలా ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండింగ్లో ఉంది.
ఇలా ఇండియా నుండి వచ్చిన ఒక పాట ఏకంగా 15 దేశాల్లో ట్రేడింగ్ లో ఉండటం అనేది మాములు విషయం కాదు. ఇక ఈ విషయం తెలిసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే రిలీజ్ తరువాత రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అలా గనక జరిగితే రాజమౌళి లేకుండా రూ.1000 కోట్లు కొల్లగొట్టిన మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు.