సీఎం కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు

సీఎం కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు

సీఎం కేసీఆర్ కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి . తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడుతాయని అనుకున్నామన్నారు. అయితే జరగలేదన్నారు. మన గమ్యం దూరంగా ఉందన్న అశ్వత్థామరెడ్డి…అందరం కలిసి గమ్యాన్ని చేరుకోడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఒక్కరే పాల్గొనలేదని…అందరితోపాటు తాము పోరాటం చేశామన్నారు. రామాయణంలో ఉడత రామునికి  దారి చూపకుంటే రామాయణమే లేదన్నారు. ఉద్యమంలో ఉడత పాత్ర ఆర్టీసీ కార్మికులదన్నారు. జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడు సమ్మె నుంచి వెనక్కి తగ్గలేదన్నారు అశ్వత్థామరెడ్డి.