జూన్ 13 నుంచి బస్సులు బంద్

జూన్ 13 నుంచి బస్సులు బంద్

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జూన్‌ 13 నుంచి  ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. జూన్‌ 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సహా 10సంఘాలతో కూడిన ఐకాస  ప్రకటించింది. కార్మికుల వేతన సవరణ బకాయిల చెల్లింపు సహా 27 డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. నిన్న యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి  నూతన  ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఐకాస నేత దామోదర్ ఈ సందర్భంగా అన్నారు. సమ్మె జరిగితే ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు