ఏఐ ​రాక వల్ల క్లరికల్​– వైట్​ కాలర్ జాబ్స్​కు ముప్పు

ఏఐ ​రాక వల్ల క్లరికల్​– వైట్​ కాలర్ జాబ్స్​కు ముప్పు

వెలుగు బిజినెస్​ డెస్క్: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (ఏఐ) ​రాక వల్ల క్లరికల్​– వైట్​ కాలర్ జాబ్స్​కు ముప్పు వాటిల్ల వచ్చని ఐబీఎం సీఈఓ అరవింద్​ కృష్ణ చెప్పారు. ఏఐ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీ మార్కెట్లో చాలా పెద్ద మార్పులనే తీసుకొస్తోందని పేర్కొన్నారు. కస్టమర్​ సర్వీస్​, హెచ్​ఆర్​, ఫైనాన్స్, హెల్త్​కేర్​ వంటి జాబ్స్​లో  ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఆటోమేషన్​ పెరుగుతుందని అన్నారు. గ్లోబల్​గా ఉన్న లేబర్​ షార్టేజ్ ప్రాబ్లమ్​ను ఏఐ పరిష్కరిస్తుందని, లేబర్​ కొరతకి కారణం డెమొగ్రఫిక్​ ఇష్యూనేనని అరవింద్​ కృష్ణ తెలిపారు.

అమెరికాలో అన్​ఎంప్లాయ్​మెంట్​ రేటు 3.4 శాతం దాకా ఉందని, 60 ఏళ్లలో ఇదే తక్కువని ఆయన గుర్తు చేశారు. హెల్త్​కేర్​, ఫైనాన్స్​ రంగాలలో ముఖ్యంగా రెగ్యులేటరీ సంబంధిత జాబ్స్​ను ఏఐ రీప్లేస్​ చేసే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. మెక్​డొనాల్డ్స్​ డ్రైవ్​–థ్రూ లేన్స్​ను ఆటోమేట్​ చేసే ప్రాజెక్టులో ఐబీఎం 2021 లో  భాగస్వామిగా ఉంది. గ్రాండ్​ మాస్టర్ గ్యారీ కాస్పరోవ్​ను 1997 లో ఓడించిన డీప్​బ్లూ సూపర్​ కంప్యూటర్ ​ డెవలప్​మెంట్​లోనూ ఉంది.