కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు బీసీలను దగా చేశాయి : జితేందర్ రెడ్డి

కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు బీసీలను దగా చేశాయి : జితేందర్ రెడ్డి

వెనబకడిన వర్గాలకు మేలు చేసేలా బీజేపీ  తెలంగాణ శాఖ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం సంతోషదాయకమని  అన్నారు ఆ పార్టీ  జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ  ఎంపీ జితేందర్ రెడ్డి . బీసీల పట్ల కేవలం బీజేపీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలను దగా చేసి  ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు కానీ.. వారి సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు.  ప్రతిభ గల ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఈ డిక్లరేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ లో 23 శాతం నిధులు కేటాయించడాన్నిజితేందర్ రెడ్డి తప్పుపట్టారు. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓబీసీలు గట్టిగ బుద్ది చెప్పాలని జితేందర్ రెడ్డి అన్నారు.