తొలగించిన టీచర్లను వెంటనే విధుల్లకి తీసుకోవాలె

తొలగించిన టీచర్లను వెంటనే విధుల్లకి తీసుకోవాలె
  • సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని అధికారులపై మండిపాటు
  • కస్తూర్బా పాఠశాలల గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తా : ఎంపీ ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్: కస్తూర్బా పాఠశాలలో తొలగించిన 937 మంది టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీచర్లు చేస్తున్న మహా దీక్షలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఏడాది నిబంధనల మేరకు కాంట్రాక్టు పద్దతిలో వీరిని విధుల్లోకి తీసుకున్నారని... కానీ  ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అనుభవజ్ఞులైన టీచర్లు రోడ్డుకెక్కారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వీరితో వెట్టిచాకిరి చేయించుకున్నారని ఆరోపించారు. కస్తూర్బా బాలికల పాఠశాలల బలోపేతానికి రాజ్యసభలో మాట్లాడతానని... తొలగించిన టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.