లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..

లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో కుండపోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..

హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది.గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ( మే 19)న హైదరాబాద్​ లో ఆకాశం మేఘావృత‌ంగా మారింది.  మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు.  దీని ప్రభావంతో వచ్చే ఐదురోజుల పాటు ( మే 19 నుంచి) తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించింది.

దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టం నకు 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ / నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో వచ్చే 5 రోజులు ( మే 19 నుంచి)  ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చ రించింది. రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్​ జారీచేశారు. 

 హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఎండలు మండిపోయాయి. మరోవైపు క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జడివాన కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.   ఇప్పటికే  ఇటీవల కురిసిన వర్షాలకు  చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి.    . పలు జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, కుత్భుల్లాపూర్​, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో  సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది.  వికారాబాద్​ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఉప్పల్​ మ్యాచ్​కు వర్షం అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో .. క్రికెట్​ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.జీహెచ్​ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.  అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.  లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయాలని సూచనలు జారీచేశారు. 

 భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు 30-  నుంచి40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.  సోమ, మంగళవారాల్లో ( మే 20,21) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు (గంటకు30 నుంచి40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నిన్నట్నించి వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, పఠాన్ చెరువు, అమీన్ పూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లోనూ, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లిలోనూ వర్షాలు పడ్డాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మద్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు తమిళనాడులో మరో ఆవర్తనం ఏర్పడింది. మే 31వ తేదీన ముందస్తుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.