కరోనా ఫండ్ రైజింగ్: హాఫ్​ మారథాన్ పరిగెత్తిన క్రికెటర్

కరోనా ఫండ్ రైజింగ్: హాఫ్​ మారథాన్ పరిగెత్తిన క్రికెటర్

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో తనవంతు సాయం అందించడానికి ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ముందుకొచ్చాడు. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) కోసం స్టోక్స్ హాఫ్ మారథాన్ (సుమారు 21 కి.మీ.) పరిగెత్తాడు. ఒక గంట 39 నిమిషాల్లో రన్ ను పూర్తి చేసిన స్టోక్స్.. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఎన్ హెచ్ఎస్ చారిటీస్ తోపాటు నేషనల్ చిల్డ్రన్స్ క్రికెట్ చారిటీకి అందించనున్నాడు. ఫండ్ రైజింగ్ పేజ్ కు విరాళాలు అందించాల్సిందిగా ఫ్యాన్స్ కు స్టోక్స్ విజ్ఞప్తి చేశాడు. ‘అది (రన్నింగ్) చాలా కష్టం. ప్లీజ్.. సాయం చేయగలిగే స్థితిలో ఉంటే డొనేట్ చేయండి. ఇదంతా గొప్ప కారణం కోసం చేస్తున్నాం’ అని స్టోక్స్ చెప్పాడు.